epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేబుల్ బ్రిడ్జికి ‘మట్టి’ గండం!

కేబుల్ బ్రిడ్జికి ‘మట్టి’ గండం!
ర్యాంపు నిర్మాణానికి బురద మట్టి
ప్ర‌శ్నార్థ‌కంగా రూ.204కోట్ల‌తో జ‌రుగుతున్న ప‌నులు
బ్రిడ్జి నిర్మాణంలో లోపాల‌తో భ‌విష్య‌త్‌పై ఆందోళ‌న‌
రూ.కోట్లు బుర‌ద‌లో పోసినా ప‌న్నీరేనా..? అంటూ విమ‌ర్శ‌లు
‘చూసి చూడనట్లు’ వ్యవహరిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు
నాణ్యత లోపం నిజమేనని ఒప్పుకున్న డీఈ భగవాన్

కాక‌తీయ‌, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరానికి మణిహారంగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు తూట్లు పడుతున్నాయి. రూ. 204 కోట్ల భారీ వ్యయంతో జరుగుతున్న ఈ నిర్మాణంలో, ర్యాంపుల కోసం నాసిరకం మట్టిని వాడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే ఏడాది నాటికి బ్రిడ్జిని పూర్తి చేయాలని ఆదేశిస్తుంటే, కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతను గాలికొదిలేసి మట్టి దందాను కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బురద మట్టితో బ్రిడ్జికి ముప్పు?
కేబుల్ బ్రిడ్జి ర్యాంపుల కోసం అత్యంత నాణ్యమైన మ‌ట్టి ఖ‌నిజాన్ని వాడాల్సి ఉండగా, అందుకు భిన్నంగా నేషనల్ హైవేలకు వాడే మెత్తటి బురద మట్టిని యథేచ్ఛగా నింపుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 70 శాతం చిన్న రాళ్లు, 30 శాతం మెత్తటి మట్టి మిశ్రమం ఉంటేనే ర్యాంపు గట్టిపడి బ్రిడ్జికి పటిష్టత లభిస్తుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా మెత్తటి మట్టిని నింపడం వల్ల భవిష్యత్తులో బ్రిడ్జి భద్రత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పక్కనే ఉన్న పాత బ్రిడ్జి బలహీనపడటంతోనే కొత్త కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అలాంటి ప్రాజెక్టులోనే నాణ్యతను పాటించకపోతే, వందల కోట్ల ప్రజాధనం బురదలో పోసిన పన్నీరులా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. సాకులతో తప్పించుకుంటున్న వైనం
నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. కళ్ల ముందే నాసిరకం మట్టిని తరలిస్తుంటే, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్ అండ్ బీ డీఈ భగవాన్‌ను వివరణ కోరగా మొదట నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన ఆయన, ఆ తర్వాత మట్టిలో నాణ్యత లోపాలు ఉన్నట్లు పరోక్షంగా అంగీకరించారు. “సైట్ విజిట్ చేసి, మట్టి తరలింపును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ప్రజా ఆశయానికి తూట్లు?
భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా, అత్యంత నాణ్యతతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రభుత్వ ఆశయం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల దెబ్బతింటోంది. గతంలో పువ్వాడ అజయ్ కుమార్ ప్రతిపాదనలతో మొదలైన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు చూస్తుంటే, పనులు పూర్తి కావడమే కానీ నాణ్యత మాత్రం గాలికి కొట్టుకుపోతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నాణ్యతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై, సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.