గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రాంమూర్తి నాయక్ పిలుపు
కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో గిరిజన దివాసీల సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని జూలై 18,19వ తేదీల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రాంమూర్తి నాయక్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్లో గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా సమితి కార్వవర్గ సమావేశం బాణోతు రాంబాబు నాయక్ అద్యక్షతన జరిగింది. ఈ సమయంలో గిరిజన సమాఖ్య జిల్లా ఇన్చార్జి మహ్మద్ మౌలానా, రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రాంమూర్తి నాయక్ హాజరై మాట్లాడుతూ. ఆదివాసీ, గిరిజన, ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుందని గిరిజన, ఆదివాసీల హక్కులను పరిరక్షంచడం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు మిగులు భూములకు పట్టాలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో మంజూరైన లబ్దిదారులకు ట్రైకార్ లోన్లకు బడ్జెట్ కేటాయించి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం జూలై 18 19వ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య రాష్ట్ర 3వ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేదర్ రెడ్డి, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి బానోతు జగ్నాధం , గిరిజన సమాఖ్య రాష్ట్ర సమితి సభ్యులు బాణోతు భరత్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్యా నర్సింహా, డుంగ్రోతు శేఖర్, కంపా అమరయ్య, గుగులోతు శ్రీను , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

