epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సుడా పీఠం.. ఎవరికి దక్కేను?

సుడా పీఠం.. ఎవరికి దక్కేను?
‘పీఠం’ చుట్టూ కరీంనగర్ రాజకీయం
ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌పై దుద్దిళ్ల పట్టు
సొంత ఇలాఖాలో ప‌ట్టు నిలుపుకునేందుకు పొన్నం వ్యూహం
చైర్మన్ రేసులో నయా-పురా నాయకుల హడావిడి

కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడు ‘సుడా’ పీఠం మంట పుట్టిస్తోంది. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవీకాలం ముగియడంతో, ఆ కుర్చీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. ఎవరికి వారు అధిష్ఠానం వద్ద లాబీయింగ్‌లో మునిగిపోతుంటే, జిల్లాలో చక్రం తిప్పుతున్న ఇద్దరు మంత్రుల వర్గాల మధ్య ‘ఆధిపత్యం’ కోసం తెరవెనుక యుద్ధం నడుస్తోంది. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరోసారి తన సీటును కాపాడుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండదండలతో, మళ్లీ తననే ఆ పీఠంపై కూర్చోబెట్టాలంటూ ఆయన అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, ఈసారి రేసులో కొత్తవారు కూడా గట్టిగానే పోటీపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు తమకే ఉంటుందనే ధీమాతో పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కూడా పోటీలో దిగారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నుంచి కార్పొరేటర్ మల్లికార్జున్ రాజేందర్ వరకు.. ఎవరి లెక్కలు వారివే!

ఇద్దరు మంత్రులు.. రెండు వర్గాలు!
సుడా చైర్మన్ ఎంపిక ఇప్పుడు దుద్దిళ్ల, పొన్నం వర్గాల మధ్య ‘ప్రతిష్టాత్మక’ పోరుగా మారింది. ఇద్దరు మంత్రులు తమ అనుయాయులకే ఆ పదవి దక్కాలని గట్టిగా కోరుకుంటున్నట్లు సమాచారం. సుడా అనేది కేవలం పదవి కాదు.. కరీంనగర్ నగరాభివృద్ధిలో కీలకం కావడంతో.. ఆ పీఠంపై తమ ముద్ర ఉండాలని మంత్రులు భావిస్తున్నారు. ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరిని పక్కన పెట్టాలో తేల్చుకోలేక అధిష్ఠానం సతమతమవుతుంటే, వీరు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.

అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుంది?
రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల బలాబలాలు.. ఇలా ఎన్నో అంశాలను బేరీజు వేసుకుని అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోమటిరెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త ముఖానికి అవకాశం ఇచ్చి జిల్లాలో కొత్త సమీకరణాలకు తెరలేపుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, సుడా పీఠం ఎవరికి దక్కుతుందనేది కరీంనగర్ కాంగ్రెస్‌లో ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’గా మారింది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయం.. జిల్లాలో వర్గ పోరుకు చెక్ పెడుతుందా? లేక మరింత నిప్పు రాజేస్తుందా? అని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.