epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి

  • ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
  • సాగుపై ఎల్‌నినో ప్రభావం ఉంటోంది
  • రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలి
  • ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
  • గీసుగొండలో సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

కాకతీయ, గీసుగొండ : ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి పంచాయతీ శిక్షణ కేంద్రంలో, గీసుగొండ మరియు సంగెం మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ‘గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, తన ఐదేళ్ల పదవీకాలంలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజల విశ్వాసాన్ని పొందడమే ప్రతి ప్రజాప్రతినిధి లక్ష్యం కావాలని సూచించారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి చేపట్టిన అభివృద్ధి పనులను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పచ్చదనం వంటి మౌలిక అంశాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, పారదర్శకంగా నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు.

రైతులకు అవగాహన కల్పించాలి
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపేలా గ్రామస్థాయిలో సర్పంచులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సర్పంచులు, కార్యదర్శులు జలసిరి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, జడ్పీ సీఈఓ రాం రెడ్డి, డిఆర్డిఓ నాగపద్మజ, డిపిఆర్ఓ ప్రేమలత, డిపిఓ కటకం కల్పన, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.