epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సుడా గిరీపై ‘పవర్‌’ వార్

  • కరీంనగర్‌లో అగ్గిరాజేస్తున్న కాంగ్రెస్ కుంపట్లు!
  • ‘సుడా’ పీఠంపై అధిష్ఠానం వద్ద తేలని పంచాయితీ
  • జూలై 8తో ముగిసిన పదవీకాలం.. రేసులో ముగ్గురు
  • శ్రీధర్‌బాబు వర్సెస్ వెలిచాల వర్గాల వ్యూహ ప్రతివ్యూహాలు!
  • సుడా చైర్మన్ పీఠం కోసం ముమ్మర లాబీయింగ్
  • రెన్యువల్ కోసం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కసరత్తు
  • అడ్డుపడుతున్న వెలిచాల రాజేందర్ రావు వర్గం
  • సామాజిక సమీకరణాల పేరుతో తెరపైకి కొత్త పేర్లు
  • అధిష్ఠానం నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ..
  • నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్యే ప్రధాన పోరు
  • ‘సుడా’ కంట్రోల్ ఎవరి చేతుల్లోకి?

కాక‌తీయ‌,కరీంన‌గ‌ర్ : కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి.. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యంత ‘హాట్’ టాపిక్. పదవీకాలం ముగిసిన వేళ, ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న కుర్చీలాట రసవత్తరంగా మారింది. ఇక్కడ జరుగుతున్న పోరు కేవలం ఒక పదవికి సంబంధించింది మాత్రమే కాదు, జిల్లా రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం చెల్లుబాటు అవుతుందో తేల్చే ‘పవర్ గేమ్’ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన రెండేళ్ల సేవలు, పార్టీకి పట్టు నిలబెట్టడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, అధిష్ఠానం వద్ద రెన్యువల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈయనకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి ధీటుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పావులు కదుపుతున్నారు. మార్కెట్ చైర్మన్ నియామకంలో తన పట్టు నిరూపించుకున్న వెలిచాల, ఈసారి తన సన్నిహితుడికి లేదా తన వర్గానికి సుడా పగ్గాలు దక్కేలా అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో ఉన్నారు. మరోవైపు, విద్యావేత్తగా గుర్తింపు ఉన్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి, రేసులో దూసుకెళ్తున్నారు.

సామాజిక సమీకరణాల ‘అస్త్రం’..
సుడా చైర్మన్ నియామకంలో ఈసారి సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారా, లేక బీసీలకు అవకాశం కల్పిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకవేళ బీసీలకు అవకాశం కల్పించాల్సి వస్తే, కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలంటే స్థానిక నాయకత్వానికి, ముఖ్యంగా ఇన్‌చార్జిల సిఫార్సులకు విలువ ఇవ్వాల్సిందేనని, అదే సమయంలో సామాజిక సమతుల్యతను కాపాడటం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది. పదవి కోసం పోటీ పడుతున్న వారు ఎవరికి వారు తామే సరైన వారమని నిరూపించుకునేందుకు రాష్ట్ర స్థాయి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సుడాపై పట్టు ఎవరిది?
కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే లేని నేపథ్యంలో, సుడా చైర్మన్ పదవి కేవలం ఒక నామినేటెడ్ పోస్టు మాత్రమే కాదు, అది నియోజకవర్గంలో ‘పారలల్ పవర్ సెంటర్’. నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి అధికారాలు ఉండటంతో, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలకు ఇది పునాదిగా మారుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు వర్గం తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తుంటే, వెలిచాల వర్గం నగరంపై పట్టు సాధించి భవిష్యత్తులో టికెట్ రేసులో ముందుండాలని ప్రయత్నిస్తోంది. ఈ నియామకం ఎవరికి దక్కినా, అది కరీంనగర్ కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎవరికీ ప్రాధాన్యం తగ్గకుండా అధిష్ఠానం ఎలాంటి ‘సమతుల్య’ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే!

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.