- పార్టీకి,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నిత్య సేవకుడిని…
- పేరంను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పాయం…
కాకతీయ,పినపాక గ్: పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఒక బాధ్యతగా స్వీకరిస్తారని,పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేరం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మణుగూరులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు,కాంగ్రెస్ పార్టీకి, ప్రతి కార్యకర్తకు నిత్య సేవకుడిగా ఉంటూ ప్రజలకు మరింత సేవ అందిస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేరం వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

