నా చావుకు ప్రధాని మోదీయే కారణం…
సర్ ఫామ్‌పై సూసైడ్ నోట్ రాసి యువకుడి బలవన్మరణం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీయే కారణమంటూ సర్ ఫామ్ పై సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గురువారం ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పిట్లా వంశీ (25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సర్ ఫామ్‌పై రాసిన సూసైడ్ నోట్‌లో “నా చావుకు ప్రధాని మోదీ కారణం. నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదు. నా దహన సంస్కారాలు ఆనవాయితీ ప్రకారం నిర్వహించండి అని కోరుతూ ఇట్లు భారతీయుడు,THANK U GOVT” అని రాశాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సూసైడ్ నోట్‌తో పాటు ఇతర అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఘటనకు గల అసలు కారణాలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ,సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

