ఎంపీడీవోగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
కాకతీయ, కరకగూడెం: కరకగూడెం మండల నూతన ఎఫ్‌ఏసీ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. మండల అభివృద్ధికి అధికారులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

