జీపీ సిబ్బందికి రెయిన్ జాకెట్ల పంపిణీ
నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.కె. ఆజాద్
కాకతీయ, గుండాల: వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.కె. ఆజాద్ ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్లు, రెయిన్ క్యాప్‌లను పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్షంలోనూ సురక్షితంగా విధులు నిర్వర్తించేలా ఈ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్.కె. ఆజాద్ మాట్లాడుతూ వర్షాల్లోనూ గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు. నవచైతన్య యువజన సంఘం తరఫున వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బత్తిని వినయ్, మండలోజు వినయ్, వల్లోజి సాగర్, కందుకూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

