పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కాకతీయ, గంభీరావుపేట: మండలంలోని శ్రీగాధ గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ, గౌడ సంఘం, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈత, తాటి, ఖర్జూర తదితర మొక్కలను నాటారు. ప్రకృతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేముల విజయలక్ష్మి మహేందర్ గౌడ్, ఉప సర్పంచ్ గౌరనేని రాజేశ్వరరావు, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, డీటీఎఫ్ ఎస్ఐ శైలజ, హెడ్ కానిస్టేబుల్ మోసిన్, గౌడ సంఘ సభ్యులు, వార్డు సభ్యులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

