epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వ భూములపై మళ్లీ కన్నేశారా..?

 

ప్రభుత్వ భూములపై మళ్లీ కన్నేశారా..?
హుజురాబాద్‌లో రూ.2 కోట్ల ప్రభుత్వ స్థలంపై కబ్జా యత్నాల ఆరోపణలు
సర్వే నంబర్ 236లో పట్టాల కోసం మళ్లీ కదలికలు
రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు
కలెక్టర్ జోక్యంతో సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్

కాకతీయ, కరీంనగర్/ హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని గణేష్‌నగర్ సర్వే నంబర్ 236లోని ప్రభుత్వ భూములపై మరోసారి కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే ఈ భూములను కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ పేర్లపై పట్టాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిన భూములపై మళ్లీ హక్కులు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయం పేరుతో భూముల కేటాయింపు

స్థానికుల కథనం ప్రకారం, సుమారు 24 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 236లో కొందరికి తలా 10 గుంటల చొప్పున వ్యవసాయం చేసుకునేందుకు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే, భూములు పొందిన వారు ఎలాంటి సాగు చేయకపోవడంతో వాటి వినియోగంపై అప్పట్లోనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈ భూములను నిరుపేదల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

భూమి విలువ పెరగడంతో కొత్త ఎత్తుగడలు

ఇటీవలి కాలంలో గణేష్‌నగర్ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరగడంతో సర్వే నంబర్ 236పై మళ్లీ కొందరి దృష్టి పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకే మరోసారి పట్టాలు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్వే నంబర్ 236కు సంబంధించిన పూర్తి భూ రికార్డులను పరిశీలించి, ప్రస్తుతం ఎలాంటి రెవెన్యూ ప్రక్రియలు కొనసాగుతున్నాయో జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన భూములపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రెవెన్యూ యంత్రాంగంపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.