అటెండర్ బిక్షపతి మృతికి నివాళి
కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సీహెచ్. బిక్షపతి మృతిపై తహసీల్దార్ జగదీశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన బిక్షపతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తరఫున అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొని బిక్షపతికి నివాళులర్పించారు.

