వరద నీటికి నాచారం రహదారి ధ్వంసం
ఫోర్ వీలర్ల రాకపోకలు నిలిపివేత.. పోలీసుల హెచ్చరిక
కాకతీయ, ఏన్కూర్: భారీ వర్షాలతో వరద ఉద్ధృతి పెరగడంతో ఏన్కూర్ మండలంలోని నాచారం టెంపుల్కు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి సమీపంలో దెబ్బతింది. వరద ప్రవాహానికి రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయి గండ్లు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ఫోర్ వీలర్ల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. భక్తులు, వాహనదారులు ప్రమాదకరంగా రహదారిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. రహదారి పునరుద్ధరణ పూర్తయ్యే వరకు నాచారం ఆలయానికి వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

