epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు
600 మంది మహిళలకు రూ.72 లక్షల విలువైన కుట్టు మిషన్లు
60 మంది కాశ ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్‌ యంత్రాలు
మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు

కాకతీయ, పెద్దపల్లి : మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్స్‌లో మంగళవారం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు, కాశ ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్‌ యంత్రాలను టీజీఎంఎఫ్‌సీ చైర్మన్‌ మహమ్మద్‌ ఒబైదుల్లా కోత్వాల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లాలో కేవలం 200 కుట్టు మిషన్లు మాత్రమే పంపిణీ చేశారని, పెద్దపల్లి పట్టణంలో 70 మిషన్లు మాత్రమే అందించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఒక్కరోజులోనే 600 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తోందని పేర్కొన్నారు.

రూ.36 లక్షల సబ్సిడీతో రాతి కటింగ్‌ యంత్రాలు

పెద్దపల్లి జిల్లాలో కాశ ముస్లిం వర్గాలకు చెందిన 60 మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.60 వేల సబ్సిడీతో రాతి కటింగ్‌ యంత్రాలను పంపిణీ చేసినట్లు విజయరమణరావు తెలిపారు. వీటి మొత్తం సబ్సిడీ విలువ రూ.36 లక్షలు అని వివరించారు. అదేవిధంగా 600 మంది మైనారిటీ కుటుంబాలకు ఒక్కొక్కటి రూ.12 వేల విలువైన కుట్టు మిషన్లను అందిస్తున్నామని, వీటి మొత్తం విలువ రూ.72 లక్షలు అని తెలిపారు. వీటి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. రాఘవాపూర్‌లో మైనారిటీల శ్మశానవాటిక కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. పెద్దపల్లి పట్టణంలో మైనారిటీల శ్మశానవాటిక కోసం 8 గుంటల స్థలాన్ని కేటాయించామని, షాదీఖానా నిర్మాణానికి కూడా స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మైనారిటీ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజయరమణరావు సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, స్థానిక కౌన్సిలర్‌, మత పెద్దలు, పెద్దపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లు, అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, మహిళలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.