epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు
ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో అడ్మిషన్‌
ఆరు భాషల్లో ప్రావీణ్యం.. రెండుసార్లు పోస్కో స్కాలర్‌షిప్‌ విజేత
పేదరికాన్ని అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ
నిషిత ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం
: ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌

కాకతీయ, హైదరాబాద్ : పట్టుదల, ప్రతిభ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లాకు చెందిన వెనగంటి నిషిత నిరూపించారు. దక్షిణ కొరియాలోని ప్రతిష్ఠాత్మక క్యుంగ్‌బుక్‌ నేషనల్‌ యూనివర్సిటీ (కేఎన్‌యూ)లో ‘కొయికా’ (KOICA) పూర్తి స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ఆమె ప్రవేశం పొందారు. ఈ ఘనత సాధించిన నిషితను మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్‌ నారాయణపేటకు చెందిన నిషిత ఒంటరి తల్లి పెంపకంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. 15 ఏళ్లకే ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి బీసీ గురుకులాల్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అనంతరం 19 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కొరియన్‌ లాంగ్వేజ్‌ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చదువులో ప్రతిభ కనబరుస్తూ రెండుసార్లు ప్రతిష్ఠాత్మక పోస్కో (POSCO) స్కాలర్‌షిప్‌ను సైతం నిషిత అందుకున్నారు. ఆమెకు ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉండటం విశేషం.

రైతులకు అండగా నిలవడమే లక్ష్యం

దక్షిణ కొరియాలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ పూర్తి చేసి ఆధునిక స్మార్ట్‌ వ్యవసాయ పద్ధతులను దేశంలో ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలవడమే తన లక్ష్యమని నిషిత తెలిపారు. పలు సవాళ్లను అధిగమించి గ్లోబల్‌ స్థాయిలో రాణిస్తున్న నిషిత పట్టుదల, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ కొనియాడారు. నిషితతో పాటు ఆమె తల్లి వేముల ప్రవళికను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిషితను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి రూ.15 వేల కోట్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.