epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం
డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు?
ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేల వరకు వసూలు
తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ఆరోప‌ణ‌లు
అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌

కాకతీయ, ఉప్ప‌ల్ : ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయంటూ తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లంచాల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియలో డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక కార్యాలయ స్థాయిలో ఎవరి వాటా ఎంత ఉందన్న విషయాన్ని విచారణ ద్వారా తేల్చాలని కోరారు. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల స్థాయిలోనూ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

యూఎల్‌సీ భూమి రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలు

పీర్జాదిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్‌పైనా ప్రవీణ్‌కుమార్‌ ఆరోపణలు చేశారు. సర్వే నంబర్లు 39, 43, 44కు సంబంధించిన ఓ ప్లాట్‌ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ పరిధిలో ఉన్నట్లు చూపుతున్నప్పటికీ రూ.2 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. అదే అపార్ట్‌మెంట్‌లో మరో ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు గతంలో పొరపాటున రిజిస్ట్రేషన్‌ జరిగిందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. ఈ రెండు వ్యవహారాలపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లలో జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు నెలనెలా వాటాలు వెళ్తున్నాయంటూ వస్తున్న ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటూనే ప్రజల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. ఉప్పల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఎదుట తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి రూ.15 వేల కోట్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.