epaper
Wednesday, September 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!

ఎనగల్‌ సమస్యలు పరిష్కరించకుంటే.. నిరాహార దీక్ష!
వాగుపై వంతెనకు నిధులు మంజూరు చేయాలి
ఎన్నికల హామీలను అమలు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి
బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్‌

కాకతీయ, చందుర్తి : ఎనగల్‌ గ్రామ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్‌లో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను డిమాండ్‌ చేశారు. ఎనగల్‌లోని ఎల్లమ్మ, బీరప్ప, చిన్నన్న–పెద్దన్న ఆలయాలు, డంపింగ్‌ యార్డు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలోని వాగుపై వంతెన లేక ప్రజలు, రైతులు, గౌడ కులస్తులు, పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని, గతంలో పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా జరిగాయని అన్నారు. ఎనగల్‌ నుంచి మామిడిపల్లి, మూడపల్లి, జోగాపూర్‌ వెళ్లే రహదారులను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అక్టోబర్‌ 5న అంబేద్కర్‌ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేపడతామని మొకిలే విజేందర్‌ హెచ్చరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు అల్లాడి రమేష్‌, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర

ఉద్యమంలో కనకం నాగయ్య కీలక పాత్ర మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాకతీయ, శంకరపట్నం:...

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో...

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన

మా అంగన్‌వాడీ.. నా బాధ్యతపై అవగాహన కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా...

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌

ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు కావాలి : ఏఈఓ సంపత్‌ కాకతీయ,జమ్మికుంట:వ్యవసాయ...

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు హెలిప్యాడ్‌, కాన్వాయ్‌...

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయండి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల...

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ

దళితుల హక్కుల సాధనకు అండ‌గా ఆర్‌పీఐ ఆర్‌పీఐ భివాండి జిల్లా అధ్యక్షుడు మహేంద్ర...

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం శంకరపట్నంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కాకతీయ,శంకరపట్నం:ఢిల్లీలో నిర్వహించిన ‘ది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.