epaper
Wednesday, September 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు

ఇసుక లోడింగ్‌పై అద‌న‌పు బాదుడు
డీడీ కట్టినా లోడింగ్‌ పేరుతో అదనపు బాదుడు
దొడ్డు ఇసుకకు రూ.2500.. స‌న్న ర‌కానికి రూ.5000 అద‌నం
ఇష్టారాజ్యంగా క్వారీ కాంట్రాక్ట‌ర్ తీరు
అంతా పీవోకు తెలిసే జ‌రుగుతోందా..?!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఇసుక బుక్‌ చేసుకుని డీడీ చెల్లించినా.. మహదేవ్‌పూర్‌ మండలం బెగులూరు క్వారీలో మాత్రం అదనపు బాదుడు తప్పడం లేదు. ఇసుక లోడింగ్‌ పేరుతో దొడ్డు రకానికి రూ.2500, సన్న రకానికి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారిక చెల్లింపులకు అదనంగా ఈ మొత్తాలను ఎందుకు తీసుకుంటున్నారు? లోడింగ్‌ చార్జీల పేరుతో ఇంత భారీగా వసూలు చేయడానికి అనుమతి ఉందా? ఉంటే ఆ వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక పొందుతున్న వినియోగదారుడిపై క్వారీ వద్ద మళ్లీ వేల రూపాయల భారం పడుతోంది. దీంతో బెగులూరు క్వారీలో కాంట్రాక్టర్‌ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

డీడీ చెల్లించినా దోపిడీ

ఇసుకను అధికారికంగా పొందేందుకు వినియోగదారుడు ఆన్‌లైన్‌లో టన్నుకు రూ.375 చెల్లించి బుకింగ్‌ చేసుకుంటున్నాడు. ఆ మొత్తం తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఖజానాలో జమవుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో చెల్లింపు పూర్తయిన తర్వాత వాహనం క్వారీకి చేరుకుంటుంది. అక్కడ ఇసుక లోడింగ్‌ కోసం మరోసారి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. దొడ్డు ఇసుకకు రూ.2500, సన్న ఇసుకకు రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన ధర, అనుమతించిన చార్జీల ప్రకారమే వ్యవహారం సాగాలి. కానీ కాంట్రాక్ట‌ర్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ అద‌న‌పు వ‌సూళ్ల‌ను య‌థేచ్ఛ‌గా సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. నిత్యం వంద‌ల లారీల్లో ఇసుక ర‌వాణా జ‌రుగుతుండ‌టంతో అక్ర‌మంగా ల‌క్ష‌ల రూపాయాలు కాంట్రాక్ట‌ర్ జేబుల్లోకి వెళ్తున్న‌ట్లు స‌మాచారం.

పర్యవేక్షణ ఏమైనట్లు

ఇసుక క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన పలు చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న ప్రశ్న బెగులూరు క్వారీ వ్యవహారంతో మరోసారి ముందుకొచ్చింది. వాహనాలకు జీపీఎస్‌ ఆధారిత పర్యవేక్షణ, లోడింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ, మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో తనిఖీలు చేపడతామని ప్రకటించారు. మరి ఇంతటి పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ క్వారీలో అదనపు వసూళ్లు జరుగుతున్నట్లు తెలుస్తుండ‌టం అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. వాహనం క్వారీలోకి వచ్చినప్పటి నుంచి లోడింగ్‌ పూర్తయ్యే వరకు జరిగే వ్యవహారాన్ని అధికారులు పరిశీలిస్తే అదనపు వసూళ్లను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.

పీవోకు తెలిసే జరుగుతోందా

బెగులూరు క్వారీలో అదనపు వసూళ్ల వ్యవహారం సంబంధిత పీవో పర్యవేక్షణపైనా ప్రశ్నలు లేవనెత్తుతోంది. పీవోకు తెలియకుండానే క్వారీ స్థాయిలో ఈ వ్యవహారం సాగుతోందా? తెలిసినా పట్టించుకోవడం లేదా? కాంట్రాక్టర్‌ తీరుపై ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించారా? అన్నది తేలాల్సి ఉంది. క్వారీని ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనదారుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు చెల్లింపుల ఆధారాలు, రసీదులు, లోడింగ్‌ రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బెగులూరు క్వారీలో అదనపు వసూళ్లపై జిల్లా యంత్రాంగం తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కేవలం క్వారీ నిర్వాహకుల వివరణ తీసుకోవడం కాకుండా ఇసుక కొనుగోలు చేసిన వాహనదారుల నుంచి నేరుగా వివరాలు సేకరించాలి. అధికారికంగా చెల్లించిన మొత్తం, క్వారీ వద్ద వసూలు చేసిన అదనపు మొత్తం, వాటికి ఇచ్చిన రసీదులు, లోడింగ్‌ చార్జీలకు ఉన్న నిబంధనలను పరిశీలించాలి. అదనపు వసూళ్లు నిబంధనలకు విరుద్ధమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆల‌స్యం త‌ప్ప‌దా..?!

ఆల‌స్యం త‌ప్ప‌దా..?! వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీకి ఇంకా బ్రేకులే ఐదేళ్లుగా సాగుతున్న భారీ నిర్మాణం భవనాలు...

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు...

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు

దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న‌ట్లు...

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం రాహుల్‌గాంధీ మాటలు నిజమని తేలింది ఓట్ల తొలగింపుపై...

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న...

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌

కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచ‌ర‌ణ‌ నవంబర్‌ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం...

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను...

ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.