చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్
కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్–2 అధికారి అభిలాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–2 అధికారిగా ఎంపికైన అనంతరం ఆయనకు చేర్యాల మున్సిపాలిటీలో తొలి పోస్టింగ్ లభించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మౌలిక వసతుల కల్పన, మున్సిపల్ సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని కమిషనర్ అభిలాష్ పేర్కొన్నారు. నూతన కమిషనర్‌కు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

