epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం మనదే
రేవంత్ రెడ్డివి అన్నీ లంగా మాటలే: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాకతీయ, గీసుగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించబోతోందని, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలన్నీ ఆచరణకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం గీసుగొండ మండలం పీడీఆర్ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, రైతుల సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లి, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, ఇప్పటికే నమోదైన వారు ఓటరు జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని,ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి,ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, నిమ్మగడ్డ వెంకన్న, గీసుకొండ మాజీ జడ్పిటిసి పోలీసు ధర్మారావు, మండల నాయకులు చల్ల వేణుగోపాల్ రెడ్డి,జయపాల్ రెడ్డి,బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య యూత్ నాయకులు సిరిసే శ్రీకాంత్, పెండ్లి పురుషోత్తం,మంద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ అధ్యక్షుడిగా కాట్రగడ్డ...

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు...

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ మాదిగ అనారోగ్యంతో...

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్‌ డిక్లరేషన్‌, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు,...

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య   హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ...

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి కరీంనగర్‌లో 20 కి.మీ. సైకిల్‌ ర్యాలీ విద్యార్థులు, వైద్యులు,...

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు గొర్రెకుంట నుంచి జాన్‌పీర్ల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.