epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

న్యాయం అడిగితే అర్ధరాత్రి అరెస్టులా?

న్యాయం అడిగితే అర్ధరాత్రి అరెస్టులా?
బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టుపై వినయ్‌ భాస్కర్‌ ఆగ్రహం
వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల పక్షాన నిలిచిన బీఆర్ఎస్‌
మహిళలు, పేదలను ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం
అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలి
పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం
: ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌

కాకతీయ, హన్మకొండ : కాజీపేట వైఎస్సార్‌ నగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని కోరినందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులను అర్ధరాత్రి అరెస్ట్‌ చేయడం దారుణమని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ పర్యటన నేపథ్యంలో తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రశ్నించిన పేదలు, ముఖ్యంగా మహిళలను ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని అమలు చేయాలని అడిగిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతోందని వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు మహిళలు, నిరుపేదల పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌ నగర్‌ భూములపై కన్నేసిన కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. పేదలను ఖాళీ చేయించే ప్రయత్నాలను బీఆర్‌ఎస్‌ సహించబోదని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు, వైఎస్సార్‌ నగర్‌ మహిళలు, కాలనీవాసులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించే వరకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మాజీ కార్పొరేటర్‌ సంకు నర్సింగరావు, తండమళ్ల వేణు, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, దువ్వ కనకరాజు, బేధరకోట రంజిత్‌కుమార్‌, బరిగెల వినయ్‌, పాలడుగుల శివకుమార్‌, నయీమ్‌ జుబేర్‌, మహమ్మద్‌ హుస్సేన్‌, సిద్ధు, కొండ్ర శంకర్‌ ఉన్నారు. వైఎస్సార్‌ నగర్‌ వాసులు హరినాథ్‌, మంజుల, సతీష్‌ కూడా అరెస్టయ్యారు. తొలుత కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన వారిని బుధవారం ఉదయం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిపై ఇనుప రాడ్‌తో దాడి

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిపై ఇనుప రాడ్‌తో దాడి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు తలపై...

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55...

‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక...

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి...

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..? వేధింపులు...

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్...

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.