మహాపాదయాత్రను విజయవంతం చేయాలి
:బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి
కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వంకాయగూడెం సర్పంచ్ వెన్నెం మల్లేశం, నాయకులు దాసారపు నరేందర్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, పోతునూరి రాజు, చెర్ల శ్రీనివాస్, జానపట్ల రాజిరెడ్డి, నాంపెల్లి కుమార్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

