epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌!

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌!
రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు
వారిలో 3.5 లక్షల మంది మహిళలే
ములుగు జిల్లాలో 4,262 మందికి మంజూరు
మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తాం : మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు : “అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌ అందించి ఆర్థిక భరోసా కల్పిస్తాం. పింఛన్‌ పొందని అర్హుల దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేస్తాం. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది” అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎం.ఆర్‌. ఫంక్షన్‌ హాల్‌లో నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి ములుగు, వెంకటాపూర్‌ మండలాలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామని, వారిలో సుమారు 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మరో 13 వేల దరఖాస్తులు అందాయని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం
మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని సీతక్క తెలిపారు. బ్యాంకు రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులను మహిళల పేరిట మంజూరు చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తూ వస్త్ర, కిరాణా దుకాణాలు, కోళ్లు, మేకల పెంపకం వంటి ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పేదలపై భారం తగ్గించేందుకు సిమెంట్‌ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కుటుంబ సంపాదన సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
రక్త మార్పిడి అవసరమయ్యే తలసేమియా బాధితులకు సైతం తొలిసారిగా చేయూత పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలకు పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం వంటి పథకాలతో పేదలకు అండగా ఉంటున్నామని వివరించారు. మహిళల్లో అక్షరాస్యత పెంపునకు చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది మహిళలు రాత పరీక్షల్లో పాల్గొన్నారని తెలిపారు.
జిల్లాలో 4,262 మందికి పింఛన్లు
ములుగు జిల్లాలో మొత్తం 4,262 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ఏటూరునాగారం 485, గోవిందరావుపేట 497, కన్నాయిగూడెం 81, మల్లంపల్లి 219, మంగపేట 667, ములుగు 390, తాడ్వాయి 340, వెంకటాపూర్‌ 396, వెంకటాపురం 515, వాజేడు 470, ములుగు మున్సిపాలిటీలో 202 మందికి పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. సోమవారం 988 మందికి ఉత్తర్వులు అందజేస్తున్నామని, మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం. సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, ములుగు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆసియా, డీఆర్డీఓ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు మూడు మండలాల్లో 1,256 మందికి...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి:...

దొంగే దొంగ అని అరుస్తున్నడు!

దొంగే దొంగ అని అరుస్తున్నడు! వైఎస్సార్‌ నగర్‌ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్‌? గుడిసెవాసులకు...

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు వైఎస్సార్‌ నగర్‌ భూములను మాయం చేసే కుట్ర బీఆర్...

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్...

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు *మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ...

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..  :ఎమ్మెల్యే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.