శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, ఆత్మకూర్ : ఆలయాల అభివృద్ధికి భక్తుల సహకారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి ద్వార స్థాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా ఆధ్యాత్మికత, భక్తిభావం, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సానుకూల భావాలను పెంపొందిస్తాయని తెలిపారు. శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నీరుకుళ్ల సర్పంచ్ తడక నీరజ, నీరుకుళ్ల పీఏసీఎస్ చైర్మన్ లింగయ్య, ఆత్మకూర్ పీఏసీఎస్ డైరెక్టర్ కంచె రవికుమార్, కాంగ్రెస్ నాయకులు నీలం రాజు, వంగేటి సత్యనారాయణ, ఉడుత రాజేందర్, ఉడుత మహేందర్, మార్క రజినీకార్ తదితరులు పాల్గొన్నారు.

