epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్

  • ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్
  • అప్పటికీ… ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో ఎన్నో మార్పులు
  • సమానత్వ శిల్పులు, హక్కుల సంరక్షకులు న్యాయవాదులు
  • ‘వృత్తిగా కాదు… సమాజంపై బాధ్యత’గా చూడాలి
  • యువ న్యాయవాదులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో(జూలై 26) : ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’ గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో లెక్స్ విట్ నెస్ (Lex Witness) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025– హైదరాబాద్ ఎడిషన్’ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఒక న్యాయవాదిగానే నా ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను. రావాల్సి వచ్చింది. అప్పటికీ… ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టు రూమ్‌లు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ లాంటివి అందుబాటులోకొచ్చాయి’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, సమానత్వాన్ని అందించే వాస్తు శిల్పులు, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షులని కొనియాడారు.

ఇప్పుడు కేవలం న్యాయ నిపుణులే కాదు

‘ఇప్పుడు న్యాయవాదులు అంటే కేవలం న్యాయ నిపుణులు మాత్రమే కాదు. బిజినెస్ ఎనేబులర్లు, కాంప్లియెన్స్ నావిగేటర్లు, టెక్ ఇంటిగ్రెటేడ్ అడ్వైజర్లు. అడ్మినిస్ట్రేషన్ పరంగా న్యాయపరమైన కార్యకలాపాల కోసం 63 శాతం పెద్ద భారతీయ కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ పైనే ఆధారపడుతున్నాయని నాస్కామ్ లీగల్ టెక్ రిపోర్ట్ – 2025 స్పష్టం చేస్తోంది. హైదరాబాద్ లో 120కి పైగా స్టార్టప్ కంపెనీలు ఈ-డిస్కవరీ, డిస్ప్యూట్ అనలిటిక్, వర్చువల్ ఐపీఆర్ ప్లాట్ ఫామ్స్ తదితర రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్నాయి’ అని అన్నారు.

5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు

దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో 5.15 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గతేడాది డిసెంబర్ లో కేంద్రం ప్రకటించింది. వీటిలో కేవలం జిల్లా న్యాయస్థానాల్లోనే 4.56 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణలోనూ 10 లక్షలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలస్యమైన న్యాయం… నిరాకరించబడిన న్యాయంతో సమానం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు

‘న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు. సమాజం పట్ల ఒక బాధ్యతగా భావించాలి. చట్టాన్ని తెలుసుకోవడమే కాదు… మార్పులకు అనుగుణంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే నేర్పును అలవర్చుకోవాలి. నిజమైన క్లయింట్ కేవలం మిమ్మల్ని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ మాత్రమే కాదు. మీపై ఆధారపడిన వ్యవస్థ అని కూడా గుర్తించాలి. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించేందుకు కృషి చేయాలి. ఎల్లప్పుడూ న్యాయం పక్షానే ఉండాలి’ అని యువ న్యాయవాదులకు సూచించారు. కార్యక్రమంలో లెక్స్ విట్ నెస్ ప్రతినిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు కంపెనీల లీగల్ హెడ్స్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.