epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

Delhi Ashram: అసభ్య సందేశాలు.. లైంగిక వేధింపులు.. ఢిల్లీ స్వామీజీపై 17మంది అమ్మాయి ఫిర్యాదు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఓ విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమంలోని స్వామీజీపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 17 మంది అమ్మాయిలు ఆ స్వామీజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ శారద ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్ మెంట్ లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి అనే స్వామీజీపై కేసు నమోదు చేశారు. బలహీన వర్గాల కేటగిరిలో పీజీ మేనేజ్ మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు స్వామీజీపై ఈ ఫిర్యాదు చేశారు.

విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, స్వామీ చైతన్యానంద తరచుగా ద్వేషపూరితంగా మాట్లాడేవారని, అశ్లీలమైన మెసేజ్‌లు పంపేవారని తెలిపారు. అంతేకాదు, భౌతికంగా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. ఆశ్రమంలోని కొంతమంది సిబ్బంది, ముఖ్యంగా మహిళా వార్డెన్లు, డైరెక్టర్ ఆదేశాల ప్రకారం విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు స్వామీ చైతన్యా నందపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. డీసీపీ అమిత్ గోయల్ సమాచారం ప్రకారం, ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయన ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడ గాలింపు ప్రారంభమైంది.

దర్యాప్తులో భాగంగా, ఆశ్రమ బేస్‌మెంట్‌లో ఉన్న ఒక వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ వాహనాన్ని స్వామీజీ ఉపయోగించినట్లు తేలింది. ఆ కారుపై ఫేక్ డిప్లమాటిక్ నంబర్ ప్లేట్‌ (39 UN 1) అమర్చినట్లు బయటపడింది. దీంతో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఆశ్రమంపై వెంటనే చర్యలు తీసుకుంది. స్వామీ చైతన్యానందను అన్ని పదవుల నుంచి తొలగించామని ప్రకటించింది. శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠం కూడా స్పందించింది. ఆయన ప్రవర్తన అక్రమమని, పీఠం ఆచారాలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ పీఠం యూనిట్‌లో రెండు బ్యాచ్‌లు ఉంటాయని, ఒక్కో బ్యాచ్‌లో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.