epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొండా వ‌ర్సెస్ పొంగులేటి

  • ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య అగ్గిరాజేసిన మేడారం టెండర్లు..
  • రూ. 71 కోట్ల ప‌నులు త‌న‌కు తెలియ‌కుండానే ఇచ్చారంటూ సురేఖ ఫైర్‌
  • మంత్రి పొంగులేటిపై అధిష్ఠానికి కొండా దంపతుల ఫిర్యాదు
  • వరంగల్‌ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో ఇన్‌చార్జి మంత్రి పెత్త‌నమేంట‌ని ఆగ్ర‌హం
  • ఇటీవ‌లే అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌ మధ్య వివాదం
  • వారం గ‌డ‌వ‌క ముందే కేబినెట్‌ మినిస్టర్స్‌ మధ్య మరో లొల్లి ..
  • హైకోర్టు తీర్పుతో ఇప్ప‌టికే స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి..
  • తాజా వివాదంతో మ‌రింత గంద‌ర‌గోళం
  • ఓరుగ‌ల్లు కాంగ్రెస్‌లో కాక‌రేపుతున్న తాజా ప‌రిణామాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతోంది. మొన్న‌నే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌ మధ్య వివాదం కాక‌రేప‌గా.. అధిష్టానం రంగంలోకిదిగి వారి మధ్య వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చింది. ఇది మరువక ముందే.. తాజాగా క్యాబినెట్‌ మినిస్టర్స్‌ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఆ శాఖకు చెందిన మంత్రుల మధ్య విభేదాలు ముదిరి రచ్చకెక్కాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. పొంగులేటిపై సీఎం రేవంత్‌ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్‌ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు.

సురేఖ తీవ్ర ఆగ్ర‌హం..

ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్‌ చేసిన కొండా మురళి ఆయనకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని తెలిపారు. ఆయన వల్ల జిల్లాలో తాము ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా రాజకీయాలను ఖర్గేకి వివరించారు. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. హైకమాండ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని కొండా దంపతులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రేవంత్‌ రెడ్డి‌.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖకు సంబంధించిన రూ. 71 కోట్ల ప‌నుల టెండ‌ర్ త‌న‌కు తెలియ‌కుండానే రావ‌డంపై మంత్రి సురేఖ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌య‌మై సురేఖ‌.. ఏఐసీసీ ఛీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గేతోపాటు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

గ‌తం నుంచే ఎడ‌మొహం.. పెడ‌మొహం

వరంగల్ ఇంచార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటినుంచి ఆయన వ్యవహార శైలిపై జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి అనేక విష‌యాల‌తో పాటు ప్రొటోకాల్ అంశంపై పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలకమైన నిర్ణయాలను ఇంచార్జి మంత్రి హోదాలో పొంగులేటి తీసుకుంటున్నారని కొండా సురేఖ కొంతకాలంగా త‌వ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే మేడారం ప‌నుల టెండ‌ర్ల లొల్లి ర‌చ్చ‌కెక్కింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం.. ఓప‌క్క ప్రతిపక్ష పార్టీల చేతిలో, మ‌రోప‌క్క హైకోర్టు తీర్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మంత్రుల రచ్చతో ఇక మల్లగుల్లాలు పడుతుంది. మంత్రుల వ్యవహారశైలిపై ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.