epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా

  • రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • గత 21 నెలల్లో రూ.12. 47 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
  • రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కాకతీయ, ఖమ్మం రూరల్ : పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి ప్రాంతంలో ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి ప్లస్2 కాలనీ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జిప్లస్2 కాలనీ వయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డును కోటి 71 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ  పరిధిలో కోటి 53 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, రూ.2 కోట్ల 65 లక్షలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, మంచినీటి సరఫరా కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. వెంకటగిరి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా జంగాల కాలనీ వరకు కోటి 32 లక్షలతో, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోట నారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో, వెంకటగిరి ఎస్సీ, బిసి కాలనీ నుండి గుదిమల్ల వరకు 2 కోట్ల 4 లక్షలతో మంజూరు చేసామని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గడిచిన 21 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.12.47 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. అర్హులైన పేదలందరికీ మరో మూడు విడతలలో రాజకీయాలకతీతంగా సొంత ఇండ్లు ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..  కోటి 71 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటున్నామని, దీని వల్ల ఇందిరమ్మ కాలనీలోని వందలాది కుటుంబాలకు ఖమ్మం, కోదాడ రోడ్డు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. మంత్రి సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో అదనపు సౌకర్యాలైన డ్రైయిన్, త్రాగునీరు, అంతర్గత రోడ్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమ అనంతరం అక్కడే గతంలో చేపట్టి, నిర్మాణం పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యాసంగిలో వరి సాగు వద్దు!

యాసంగిలో వరి సాగు వద్దు! వానాకాలం పంటను కాపాడాలి.. తాగునీటికి ముందస్తు చర్యలు మంత్రి...

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం

డీసీసీబీ నిర్లక్ష్యంపై జేసీ ఆగ్రహం ప్రజావాణిలో దళిత మహిళ ఫిర్యాదుపై తక్షణ స్పందన రెండు...

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా

ప్రమాదాల నివారణకు నిరంతర నిఘా గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యం అందించాలి :...

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంచాలి నవంబర్‌ నుంచి...

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం

కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు...

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

నేడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన కాకతీయ, ఖమ్మం :...

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి

ఎమ్మెల్సీ గెలుపున‌కు నడుం బిగించాలి ఖమ్మం నుంచి అత్యధిక ఓట్లు నమోదు చేయించాలి మాజీ...

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌

12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆల‌యానికి భూమి పూజ‌ చిన్నజీయర్‌ స్వామీజీని ఆహ్వానించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.