epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థి శ్రీ వ‌ర్షిత మృతికి ప్ర‌భుత్వ‌మే కార‌ణం

  • గురుకులాల‌పై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం కొన‌సాగుతోంది
  • విద్యార్థి మృత‌దేహంతో హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
  • బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్

కాకతీయ, హుజురాబాద్: హ‌న్మ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న శ్రీ వర్షిత ఆత్మహత్య ఘటనపై హుజరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని మృతదేహంతో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత మృతదేహానికి హుజరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వయంగా మృతదేహాన్నీ మోసుకుంటూ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం చౌరస్తాలో మృతదేహాన్ని ఉంచి బైఠాయించి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యమే బాలిక మృతికి కార‌ణ‌మంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అమాయక గురుకుల విద్యార్థులు బలవుతున్నారని మండిపడ్డారు. ​శ్రీ వర్షిత కుటుంబానికి తక్షణమే రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడిన విద్యార్థిని వెంటనే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి, డిమాండ్లను తెలియజేయగా కలెక్టర్ ఈ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు.

కలెక్టర్ హామీతో ఎమ్మెల్యే ధర్నాను విరమించారు. అనంతరం మృతదేహంతో రాంపూర్ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై ప్రభుత్వం నుంచి తక్షణమే విచారణ మరియు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేశాయి. మృతురాలు శ్రీ వర్షిత తండ్రి వనం తిరుపతి ఫిర్యాదు మేరకు వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఒత్తిడి కారణమని ఆయన ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.