epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నూతన సంస్కరణలు తీసుకొస్తాం

  • అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మా ప్యానల్ దే గెలుపు
  • డిపాజిట్లు పెంచుతాం, 4 బ్రాంచులు ఏర్పాటు చేస్తాం
  • భద్రతకు పెద్దపీట వేస్తాం
  • ఆరోపణల్లో కురుకుపోయిన వారే మళ్లీ పోటీలో..
  • కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ‘పార్లమెంట్’ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్, జగిత్యాల అర్బన్ బ్యాంకు ఖాతాదారులు, సభ్యుల సహకారంతో తమ ప్యానల్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్యానెల్ అభ్యర్థులు మంచి అనుభవం, ఆశయం కలిగిన వారని, విజయం సాధించిన తర్వాత అర్బన్ బ్యాంకును అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శనివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా కొత్త మండ‌లం వెలిచాల ప్రజా కార్యాలయంలో అర్బన్ బ్యాంకు ప్యానెల్ అభ్యర్థులతో కలిసి రాజేందర్ రావు మాట్లాడారు. ఆయన తమ ప్యానల్ అభ్యర్థులను ప్రకటించారు. అర్బన్ బ్యాంకు అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారే మళ్లీ అధికారం కోసం తాపత్రయపడుతున్న అంశంతో పాటు పలు వివరాలను వెల్లడించారు.

ఎనిమిది సంవత్సరాలుగా కరీంనగర్ అర్బన్ బ్యాంకుకు ఎన్నికలు జరగలేదన్నారు. తమ ప్యానల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత అర్బన్ బ్యాంకును పూర్తిస్థాయిలో సంస్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అర్బన్ బ్యాంకులో రూ.92 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, తమ ప్యానల్ గెలిస్తే ఈ డిపాజిట్లను మూడింతలు అయ్యేలా చేస్తామన్నారు. హుస్నాబాద్, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంటలో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి ముడిపడి ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి వెంట ఉండి గెలిపించే బాధ్యత తాను తీసుకున్నానని రాజేందర్ రావు స్పష్టం చేశారు. ఖాతాదారులకు, సభ్యులకు భరోసా కల్పించేందుకు అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందిస్తామని ప్యానల్ ఎంపికలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ఉండే విధంగా చూశామని తెలిపారు.

గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి ఒక ప్యానెల్గా ఏర్పాటు చేసుకొని ఓటర్ల ముందుకు వస్తున్నారన్నారు. గతంలో పనిచేసిన వారి తీరు బెరీజు వేసుకొని ఓటర్లు ఆలోచన చేయాలని సూచించారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ నియోజకవర్గ నుంచి మంచి ఆశయం, పట్టుదల ఉన్న ఇద్దరిని తమ ప్యానెల్ కు ప్రతిపాదించారన్నారు. అర్బ‌న్ బ్యాంక్ ఎన్నిక‌ల్లో త‌మ ప్యాన‌ల్ కు మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, ప్ర‌భుత్వ విప్ వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీ‌నివాస్ ఆశీర్వాదాలున్నాయ‌ని వెలిచాల తెలిపారు. శ‌నివారం రాజేంద‌ర్ రావు హైద‌రాబాదులో మంత్రులు పొన్నం, తుమ్మ‌లను, ప్ర‌భుత్వ విప్ ను క‌లిసి క‌రీంన‌గ‌ర్ అర్బ‌న్ బ్యాంక్ పాన‌ల్‌ డైరైక్ట‌ర్ల‌ను ప‌రిచయం చేశానన్నారు. కార్య‌క్ర‌మంలో అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకటరవీందర్ రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్ కుమార్, మన్నె అనంత రాజు, మునిఫల్లి ఫణిత, దామెర శ్రీలత రెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, కాంగ్రెస్ నాయకులు మీసాల శంకర్, అనంతుల రమేష్, బట్టు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.