epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏటా సంక్రాంతికి రూ.30 వేలు!

ఏటా సంక్రాంతికి రూ.30 వేలు!
మ‌హిళా ఓట‌ర్ల‌కు ఖాతాల్లో జ‌మ‌చేస్తాం
తేజస్వి యాదవ్ ఎన్నికల హామీ
‘మాయ్-బహిన్ మాన్ యోజనా’ పథకాన్ని ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డి
హాట్ టాపిక్‌గా మారిన యువ నేత ప్ర‌క‌ట‌న‌

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : బీహార్‌లో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ హీటెక్కుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజునే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే ప్రకటన వెలువడింది. మహిళా ఓటర్లను ఆకర్షించేలా ఆర్జేడీ నేత, కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన హామీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తేజస్వి యాదవ్ తన ఎన్నికల హామీలో భాగంగా, ప్రతి మహిళా ఓటరుకి సంవత్సరానికి రూ.30,000 నగదు సాయం అందిస్తామని ప్రకటించారు. “మేము అధికారంలోకి వస్తే ‘మాయ్-బహిన్ మాన్ యోజనా’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రతి మకర సంక్రాంతి రోజున మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.30 వేలు జమ చేస్తాం,” అని తేజస్వి స్పష్టం చేశారు. ఈ హామీ ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీహార్ ప్రభుత్వం ఇటీవ‌ల నవరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 నగదు జమ చేసింది. ఈ చర్య కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ చేసిన హామీ దానికి మించి ఉండటంతో, బీహార్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది.

మహిళా ఓటర్లపై దృష్టి.. రాజకీయ లెక్కలు మారుతాయా?

బీహార్‌లో మహిళా ఓటర్ల శాతం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తేజస్వి హామీ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహిళా ఓటర్ల మనసు గెలవగలిగితే, బీహార్ ఎన్నికల ఫలితాలు తేజస్వి వైపు తిప్పుకోవడం ఖాయమ‌ని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక రూలింగ్ ఎన్డీయే నేతలు మాత్రం ఈ హామీని అవాస్తవం, ఆర్థికంగా అమలు చేయలేనిది అని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, ఏటా ఈ స్థాయి నగదు పంపిణీ సాధ్యమా అన్నదానిపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొత్తానికి ఓటింగ్ దశలు సమీపిస్తున్న వేళ, మహిళా ఓటర్ల మద్దతు ఎటు మొగ్గుతుందో అన్నది ఆసక్తిగా మారింది. అయితే తేజస్వి ఆర్థిక హామీ బీహార్ రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తుందా? అనేది నవంబర్ 20న మొదలయ్యే మొదటి దశ పోలింగ్ తరువాతే తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.