epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లంకపల్లి పంచాయతీ ‘రాజా’దే!

లంకపల్లి పంచాయతీ ‘రాజా’దే!
రాష్ట్ర నేతల హోరాహోరీ ప్రచారం
ఐనా చివరికి మాచినేని వైపే నిలిచిన జ‌నం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాచినేని రాజా చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. ఈ పంచాయతీ ఎన్నిక సాధారణ గ్రామస్థాయి పోటీగా కాకుండా, ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ప్రతిష్ఠాత్మక సమరంగా మారడంతో జిల్లా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు సమీప బంధువు సిరిపురి రాధిక ఒకవైపు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నున్నా రామకృష్ణ మేనల్లుడు మాచినేని రాజా చంద్రశేఖర్ మరోవైపు బరిలో నిలవడంతో లంకపల్లి రాజకీయంగా వేడెక్కింది. ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగిన ప్రచారం చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేపింది.

మంత్రులు, నేతల చూపంతా లంకపల్లిపైనే
ఎన్నికల ప్రచారం రోజుల్లో లంకపల్లి గ్రామం రోజూ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇరు వర్గాల నేతలు తమ బలాన్ని ప్రదర్శించడంతో పాటు, బంధువుల గెలుపు కోసం శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించారు. ఈ పోరు రాష్ట్ర మంత్రులు, జిల్లా నేతల దృష్టినీ ఆకర్షించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరకు మాచినేని రాజా చంద్రశేఖర్ విజయం సాధించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయి–దయానంద్ దంపతులు, తన మేనమామ నున్నా రామకృష్ణ ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.

గ్రామానికి ఐదేళ్ల సేవల హామీ
తనకు అవకాశం కల్పించిన లంకపల్లి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న ఐదేళ్లపాటు మడమ తిప్పని సేవలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సర్పంచ్ రాజా చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. లంకపల్లి పంచాయతీ ఫలితం జిల్లాలో రాజకీయంగా మరో చర్చకు తెరలేపింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.