epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బ‌ల్దియా క‌మిషనర్ ప్రఫూల్ దేశాయ్
ఇంజనీరింగ్ పనులపై సుడిగాలి పర్యటన
రోడ్లు, పైపులైన్ పనుల తనిఖీ..
జనవరి 1లోగా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదటగా నగరంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు పనులను తనిఖీ చేసి, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం అమరవీరుల స్థూపం సమీపంలో మంచి నీటి సరఫరా పైపులైన్ లీకేజీ మరమ్మతు పనులను పరిశీలించి, వెంటనే లీకేజీ అరికట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఐడీఎస్ఎంటీ టీ భవనం ఆధునీకరణ పనులను పరిశీలించిన కమీషనర్, జనవరి 1లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే మానేరు డ్యాం సమీపంలో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఇరువైపులా నాటిన పండ్ల మొక్కలు, ఓపెన్ జిమ్‌ను తనిఖీ చేశారు. వాకింగ్ ట్రాక్‌పై స్టోన్ డస్ట్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్‌లో చెడిపోయిన పరికరాలను త్వరితగతిన రిపేర్ చేసి వాకర్లకు సౌకర్యం కల్పించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్థూపం సమీపంలోని మంచి నీటి పైపులైన్ 30 సంవత్సరాల క్రితం వేసినదైనందున తరచూ లీకేజీలు జరుగుతున్నాయని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానేరు డ్యాం నుంచి వచ్చే సీఫేజీ వాటర్‌ను కచ్చనాల ద్వారా మళ్లించేలా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా సప్తగిరి కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజీవ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.