epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యే భవిష్యత్‌కు పునాది

విద్యే భవిష్యత్‌కు పునాది
ప్రపంచ స్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
గ్రామీణ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు
సృజనాత్మకతకు వేదికగా ఇన్‌స్పైర్ : మంత్రి తుమ్మల
900 ఎగ్జిబిట్స్‌తో జిల్లా స్థాయి ప్రదర్శన

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మన విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీలకు సన్నద్ధం చేసేలా విద్యా బోధన ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరం బల్లేపల్లిలోని ఎస్.ఎఫ్.ఎస్. పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌కు 900కు పైగా ప్రదర్శనలు రావడం విద్యార్థుల సృజనాత్మకతకు నిదర్శనమని ప్రశంసించారు.

సమస్యలకు శాస్త్రీయ ఆలోచనలు

గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలుగా చిన్న చిన్న యంత్రాలను విద్యార్థులు రూపొందించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులను సులభతరం చేసే ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందించి మెరుగైన భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు.

కలలు కని… సాధించాలి

దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితాన్ని ఉదాహరణగా ప్రస్తావించిన మంత్రి, చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అదే విధంగా విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఇన్‌స్పైర్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్‌ను పెంచుతాయని అన్నారు. పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో ఆలోచించాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరమని, ప్రపంచ మార్పులకు అనుగుణంగా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఈవో చైతన్య జైని, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.