epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌

హెచ్‌–1బీ వీసాదారులకు అమెరికా షాక్‌
సోషల్ మీడియా వెట్టింగ్‌తో ఇంటర్వ్యూలు వాయిదా
భారత్‌లోనే చిక్కుకున్న వందలాది మంది ఐటీ ఉద్యోగులు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది భారతీయ హెచ్‌–1బీ వీసాదారులు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వీసా రీన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్‌కు వచ్చిన వారి కాన్సులర్ అపాయింట్‌మెంట్‌లను అమెరికా విదేశాంగ శాఖ అకస్మాత్తుగా వాయిదా వేసింది. డిసెంబర్‌ 15 నుంచి 26 మధ్య జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా వేస్తూ ఈమెయిళ్లు పంపినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా అభ్యర్థులు జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశం లేదని నిర్ధారించడమే లక్ష్యమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు నెలల తరబడి భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారత్‌లో వందలాది క్లయింట్లు చిక్కుకుపోయారని ప్రముఖ ఇమిగ్రేషన్ లా ఫర్ములు వెల్లడిస్తున్నాయి. ‘‘ఇంతటి గందరగోళ పరిస్థితిని ఇప్పటివరకు చూడలేదు. దీనిపై స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదు’’ అని ఇమిగ్రేషన్ న్యాయవాది వీణా విజయ్ ఆనంత్ వ్యాఖ్యానించారు. డెట్రాయిట్‌ సమీపంలో నివసిస్తున్న ఓ ఉద్యోగి పెళ్లి కోసం భారత్‌కు వచ్చి, డిసెంబర్‌ 17, 23 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉండగా అవి రద్దుకావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డిసెంబర్‌ 9న అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన హెచ్చరిక కూడా కలవరం రేపుతోంది. అపాయింట్‌మెంట్ వాయిదా సమాచారం వచ్చినప్పటికీ పాత తేదీన కాన్సులేట్‌కు వెళ్తే ప్రవేశం నిరాకరిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆలస్యాల నేపథ్యంలో ఉద్యోగ సంస్థలు ఎంతకాలం వేచి చూస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో పెరుగుతోంది.

అమెరికాలో హెచ్‌–1బీ వీసాదారుల్లో 71 శాతం మంది భారతీయులేనని యూఎస్‌సీఐఎస్ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌, ఆపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను విదేశీ ప్రయాణాలపై హెచ్చరిస్తూ, వీసా ప్రక్రియలో ఏడాది వరకు ఆలస్యం కావచ్చని సూచించాయి. దీంతో హెచ్‌–1బీ వీసాదారుల్లో భవిష్యత్‌పై అనిశ్చితి మరింత పెరిగింది

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.