epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”

డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి”
సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి
డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరి
నకిలీ కరెన్సీ గుర్తింపుపై శిక్షణ
గౌస్ ఆలం, కరీంనగర్ పోలీస్ కమిషనర్

కాకతీయ, కరీంనగర్ : డిజిటల్ లావాదేవీలు పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని ‘అస్త్ర’ హాలులో మంగళవారం డిజిటల్ లావాదేవీలు, సైబర్ నేరాలు, నకిలీ కరెన్సీ గుర్తింపుపై అవగాహన సదస్సును నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో సైబర్ మోసాలపై అవగాహన పెంచి, బాధితులకు వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ మోసాలను గుర్తించడంలో పోలీసు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

డిజిటల్ మోసాలపై శిక్షణ
ఇటీవల విస్తరిస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, లాటరీ పేరుతో జరిగే మోసాలు, అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఖాతాలు ఖాళీ చేసే ఘటనలపై సవివరంగా వివరించారు. యూపీఐ, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, తక్షణ చెల్లింపు సేవల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత ఇచ్చారు. యూపీఐ పిన్‌ను ఎవరికీ చెప్పకూడదని, ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో మోసపోయినప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అసలు కరెన్సీ నోట్లలో ఉండే భద్రతా లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే విధానం, నోట్ల మార్పిడి నిబంధనలపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాలు, సైబర్ భద్రత పాటించాల్సిన మార్గాలను ప్రాయోగికంగా వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) వెంకటరమణ, ఆర్‌బీఐ అధికారులు, ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ మేనేజర్ సత్యజిత్ ఘోష్, మేనేజర్ ఖాదర్ హుస్సేన్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.