epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ భావజాలం బతికితేనే దేశానికి ర‌క్ష‌

కాంగ్రెస్ భావజాలం బతికితేనే దేశానికి ర‌క్ష‌
మత విద్వేష రాజకీయాలతో సమాజానికి తీరని నష్టం
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే బీజేపీ కుట్ర
దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాల వ్యాప్తి ఒక్కటే మార్గమని, ఆ భావజాలం బతికి ఉంటేనే భారతదేశ సమైక్యత, ప్రజాస్వామ్యం కాపాడబడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశం స్వాతంత్ర్యం సాధించిన చారిత్రక రోజును గుర్తు చేస్తూ, స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదిరించిన పార్టీ కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క అన్నారు. శతాబ్దాలుగా కులాలు, మతాలు అనే భేదం లేకుండా కలిసి జీవిస్తున్న భారత సమాజంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇలా రాజకీయ లాభం పొందవచ్చేమోగానీ, సమాజానికి మాత్రం తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీపై కుట్రలు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో పేదలకు ఉపాధి కల్పించాలనే గొప్ప ఆశయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తే, నేడు దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. గాంధీజీ పేరును పథకం నుంచి తొలగించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ కుట్రలను ఎండగట్టేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పిలుపు మేరకు గ్రామ గ్రామాన కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
హరిత విప్లవం, శ్వేత విప్లవం, పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిగా ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, ఆర్టీఐ చట్టం, యూజీసీ ఏర్పాటు, ఐఐటీలు, ఐఐఎంల స్థాపన వంటి సంస్కరణలన్నీ కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమయ్యాయని చెప్పారు. మహిళా సాధికారత, అంటరానితనం నిర్మూలన, ప్రతి పౌరునికి ఓటు హక్కు వంటి ప్రజాస్వామ్య పునాదులు కాంగ్రెస్ పార్టీ వేసిందన్నారు.

జనవరి 26న జెండా పండుగ

దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ‘కాంగ్రెస్ జెండా పండుగ’ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, పార్టీ భావజాలాన్ని వివరించే కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. భారత రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో శాంతియుత అధికార మార్పిడి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలోనూ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.