epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా

గంద‌ర‌గోళంగా మునిసిప‌ల్ ఓట‌ర్ల జాబితా
వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు
పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ నేత‌ల‌ ఫిర్యాదు

కాక‌తీయ‌, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో అనేక చోట్ల తీవ్రమైన వ్యత్యాసాలు, తప్పిదాలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆరోపించింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా మెమోరాండం సమర్పించారు. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, సీనియర్ నాయకులు డా. ఎస్. ప్రకాష్ రెడ్డి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ఆంటోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులను వార్డు వారీగా పరిశీలించగా, అనేక ప్రాంతాల్లో ఓటర్ల నమోదు విషయంలో తీవ్రమైన అసమానతలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదైనట్లు గుర్తించామన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోకి రాని కొన్ని గ్రామపంచాయతీలకు చెందిన ఓటర్లు కూడా మున్సిపల్ ఓటర్ లిస్టుల్లో కనిపించాయని పేర్కొన్నారు.

దూర గ్రామాల ఓటర్ల నమోదు

దేవరకొండ నుంచి సుమారు 15–20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు కావడం గమనించామని తెలిపారు. ఇది ఓటర్ లిస్టుల తయారీలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రూపొందించిన ఓటర్ లిస్టును ఆధారంగా తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియలు కొనసాగుతాయని, అయితే గతంలోనూ కిందిస్థాయిలో చేర్పులు–తొలగింపుల వల్ల ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. అప్పట్లో కూడా ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలపై పూర్తిస్థాయి ఎంక్వైరీ జరపాలని, బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వార్డు వారీగా, మున్సిపాలిటీ వారీగా ఓటర్ లిస్టులను సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో కనిపిస్తున్న ఈ లోపాలు ప్రజాస్వామ్య ప్రక్రియపైనే అనుమానాలు కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.