epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొండగట్టు చుట్టూ రాజ‌కీయం

కొండగట్టు చుట్టూ రాజ‌కీయం
ఆల‌య అభివృద్ధిపై రాజుకుంటున్న రాజ‌కీయ వేఢీ
ఎమ్మెల్యే స‌త్యం, మాజీ ఎమ్మెల్యే సుంక‌రి మ‌ధ్య స‌వాళ్లు
గ‌త ప్ర‌భుత్వంలో అభివృద్ధే లేద‌న్న స‌త్యం
లెక్క‌ల‌తో స‌హ నిరూపించేందుకు సిద్ధ‌మంటున్న సుంక‌రి
పొలిటిక‌ల్ క్రెడిట్‌పై వాగ్యుద్ధం
గుడి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ కావాలంటున్న‌ భక్తులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇన్నాళ్లు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఇప్పుడు రాజకీయ వేడికి కేంద్రంగా మారింది. ఆలయ అభివృద్ధి పేరుతో గతంలో ఇచ్చిన హామీలపై మొదలైన చర్చ క్రమంగా నేతల నిబద్ధతను ప్రశ్నించే బహిరంగ రాజకీయ సమరంగా మారింది. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రాజీనామా సవాళ్ల వరకూ వెళ్లిన ఈ వివాదం జిల్లా రాజకీయాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు అభివృద్ధికి భారీ హామీలు ఇచ్చారని, కానీ అవి మాటలకే పరిమితమయ్యాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. హామీలే తప్ప నిధుల జాడ ఎక్కడా కనిపించలేదని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి.
కొండగట్టు అభివృద్ధికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసినట్టు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే పదవినే కాదు రాజకీయ జీవితాన్నే వదిలేస్తానంటూ ఎమ్మెల్యే సత్యం సంచలన సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. కొండగట్టు పేరు చెప్పుకుని రాజకీయాలు చేశారే తప్ప అభివృద్ధి జరగలేదన్న ఆరోపణలతో ఆయన దూకుడు పెంచారు.

మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ప్రతిసవాల్
ఎమ్మెల్యే సత్యం సవాల్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రంగంలోకి దిగారు. మాటల యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ ‘సమయం, తేదీ చెప్పు.. బీఆర్ఎస్ పాలనలో కొండగట్టుకు వచ్చిన ప్రతి పైసా లెక్కలతో బహిరంగంగా చూపిస్తా’ అంటూ ప్రతిసవాల్ విసిరారు. కొండగట్టు వై జంక్షన్‌ను సాక్షిగా చేసుకుని నిధుల వివరాలు బయటపెడతానని ప్రకటించారు. నిధులు వచ్చినట్టు తేలితే ఎమ్మెల్యే సత్యం తన మాట నిలబెట్టుకుని పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం మాటల యుద్ధం నుంచి ప్రతిష్ఠ సమరంగా మారింది.

ప‌వ‌న్ చొర‌వ‌.. పెరిగిన రాజ‌కీయ వేఢీ..!

ఇదిలా ఉండగా కొండగట్టు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన నిధులు రాజకీయ చర్చకు మరో మలుపు ఇచ్చాయి. బయట రాష్ట్రం నుంచి సహాయం వస్తుంటే తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఏం చేశాయన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. గిరి ప్రదక్షిణ వంటి మౌలిక సదుపాయాలకైనా ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి రావడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్నాళ్లు ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయమైన అంజన్న కొండ ఇప్పుడు బీఆర్ఎస్–కాంగ్రెస్ రాజకీయ సమరానికి వేదికగా మారింది. ఒక వర్గం ‘ఒక్క రూపాయి రాలేదు’ అంటుంటే మరో వర్గం ‘ప్రతి పైసా లెక్కలతో చూపిస్తాం’ అంటూ ప్రతిసవాళ్లు విసురుతోంది. కొండగట్టుకు నిజమైన శాశ్వత అభివృద్ధి ఎప్పుడు?
రాజకీయ లాభనష్టాలకన్నా ముందుగా భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన అంజన్న గుడి అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ కావాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.