epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
ఏడాదిలో ఏదులాపురంను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం
: మంత్రి పొంగులేటి

కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బారుగూడెంలో రూ.24.27 లక్షలు, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలు, నాయుడుపేటలో రూ.44.50 లక్షలు, నడిమితండలో రూ.77.10 లక్షలు, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలు, ఆటోనగర్‌లో రూ.17.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

రూపు మారుతున్న మున్సిపాలిటీ

నాయుడుపేటలో రూ.26.30 లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులు, మహబూబాబాద్ క్రాస్‌రోడ్ జంక్షన్ వద్ద రూ.7.40 లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణం, రూ.24.30 లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఏదులాపురం మున్సిపాలిటీ 19వ వార్డు గొల్లగూడెంలో రూ.42.26 కోట్లతో 14 అభివృద్ధి పనులు, పెద్దతండ గ్రామపంచాయతీలో సుమారు రూ.14 కోట్లతో పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. గత పాలకుల హయాంలో మౌళిక వసతుల కల్పనను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన మంత్రి, రాబోయే ఏడాది కాలంలో ఏదులాపురం మున్సిపాలిటిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మున్నేరు వరదలతో ఇబ్బంది పడ్డ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వర్షాకాలం నాటికి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

పేదలకే ప్రాధాన్యం.. సంక్షేమమే దిక్సూచి

ఆటోనగర్ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా మౌళిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న మంత్రి, వారం రోజుల్లో మరో రెండు రోడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యే బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని విమర్శించిన మంత్రి, ఇందిరమ్మ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాబోయే మూడు విడతల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట పారదర్శకంగా పంపిణీ చేస్తామని, ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం రూరల్ తహసిల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.