epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!

కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!
ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే
కిలోమీటర్ల కొద్ది నడిచొచ్చిన కామ్రేడ్స్‌
ఖ‌మ్మం ప్ర‌ధాన వీధుల్లో జనసేవాదళ్ కవాత్
వేల మందిని ఆకట్టుకున్న కళారూపాలు
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు చారిత్రక ముగింపు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం నగరం ఎర్రబారింది. కామ్రేడ్స్ కదం తొక్కగా… అరుణ పతాకాలు ఆకాశాన్నే తాకాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పురవీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఎర్రజెండా… ఎర్రని వస్త్రధారణతో నగరమంతా కమ్యూనిస్టు ఉద్యమ ఉత్సాహంతో మార్మోగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఖమ్మానికి చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యారు. ప్రధాన రహదారులన్నీ కార్యకర్తల రాకతో దిగ్బంధితమయ్యాయి. ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే కనిపించాయి.

కిలోమీటర్ల కొద్ది నడిచిన కామ్రేడ్స్

భారీగా తరలివచ్చిన జనంతో ట్రాఫిక్ జామ్ కావడంతో, పలువురు కార్యకర్తలు కిలోమీటర్ల కొద్ది నడిచి ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాలు నగరంలోకి రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అయినా, అలసటను లెక్కచేయకుండా శ్రేణులు ముందుకు సాగాయి. ఈ సభలో యువత భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషంగా మారింది. జనసేవాదళ్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, యువతులు తరలివచ్చారు. క్రమశిక్షణతో మూడు కిలోమీటర్ల మేర నడిచి సభా స్థలికి చేరుకున్న యువత… నాయకుల ఉపన్యాసాలకు, ప్రజానాట్యమండలి పాటలకు అలసిపోకుండా కేరింతలు కొట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన “ఎర్రజెండా… ఎర్రజెండా” పాటకు సభా ప్రాంగణం మొత్తం ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా వేలాది మంది అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త విప్లవ వాతావరణాన్ని సృష్టించారు. యువత ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి కూడా ఒక్కింత ఆశ్చర్యపోయినట్టు సభావర్గాలు పేర్కొన్నాయి.

మూడు ప్రదర్శనలు… వేలాది జనం

ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో మూడు భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తలు వరుసకు నలుగురు చొప్పున క్రమశిక్షణతో కదం తొక్కారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ కవాతును నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా యువ మహిళల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల లోపు చిన్నారులు కూడా లెఫ్ట్… రైట్… అంటూ కదం తొక్కుతూ భవిష్యత్తు తరమే మాదన్న సందేశాన్ని చాటి చెప్పారు. ఈ ప్రదర్శనకు సీపీఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు. జనసేవాదళ్ తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్ష పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు, కోయ–లంబాడ జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా ఈ కవాతులో భాగమయ్యారు. ఇటీవల ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ఈ ప్రదర్శన సాగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మూడు దారులు… ఒకే లక్ష్యం

రెండో ప్రదర్శన నయాబజార్ కళాశాల నుంచి ప్రారంభమై మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. దీనికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్, కె. శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ నేతృత్వం వహించారు. మూడో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై రోటరీ నగర్, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు జాతీయ సమితి సభ్యులు ఎస్‌కే సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. మొత్తంగా…ఎర్రజెండాల మధ్య ఖమ్మం నగరం చరిత్రాత్మక దృశ్యానికి వేదికగా నిలిచింది. వందేళ్ల ఉద్యమానికి తగ్గట్టే… మరో వందేళ్ల పోరాటానికి సిద్ధమన్న సంకేతాన్ని ఈ శతాబ్ది ముగింపు సభ గట్టిగా వినిపించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.