epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవినీతికి నో చెప్పాలి.. నిజాయితీకి ఓటేయాలి!

అవినీతికి నో చెప్పాలి.. నిజాయితీకి ఓటేయాలి!
ప్రజల మధ్య ఉండే నాయకులకే పట్టం క‌ట్టాలి
పార్టీలకే కాదు.. క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎన్నికల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం
చేర్యాల‌ జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్

కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి రాజకీయాలకేమీ సంబంధించినవి కాదని, ఇవి పూర్తిగా గల్లీ స్థాయి పాలనకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు అంటే ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు కీలకమని, ఆ దిశగా ప్రజల మధ్య ఉండి నిరంతరం సేవ చేసే నాయకులకే ఓటు వేయాలని ఆయన సూచించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సమాజ హితానికి వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

“క్యారెక్టర్, కండక్ట్, కేపబిలిటీ, పబ్లిక్‌తో కనెక్టివిటీ” ఉన్న లీడ‌ర్ కావాలి

ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, ప్రతిపక్ష నాయకుడైన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ పార్టీల తరఫున అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో స్పష్టమైన ప్రమాణాలు పాటించాలని డాక్టర్ పరమేశ్వర్ సూచించారు.
“క్యారెక్టర్, కండక్ట్, కేపబిలిటీ, పబ్లిక్‌తో కనెక్టివిటీ” ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి ప్రజల్లోకి పంపాలని ఆయన కోరారు. అలా చేసినప్పుడే స్థానిక పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఆర్థిక అవకతవకలు జరగకుండా ఎన్నికల నిర్వహణ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలపై నిఘా పెంచాలని, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగేలా చూడాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అందె అశోక్, బుట్టి సత్యనారాయణ, గడిపే బాల నర్సయ్య, పోలోజు వెంకటాద్రి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, చందా శ్రీకాంత్, వలబోజు నర్సింహా చారి, నంగి కనకయ్య, గోమారపు నర్సయ్య, సిద్ధిరాం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.