epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
గంగుల కమలాకర్

కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, కరీంనగర్ నగరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అభివృద్ధి చేయని ప్రభుత్వాలు రానున్న మూడేళ్లలో ఏమి చేస్తాయని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
గురువారం 47వ, 21వ డివిజన్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌ల నామినేషన్ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాంనగర్‌లోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండేళ్లలో పొన్నం ప్రభాకర్ గానీ, బండి సంజయ్ గానీ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ టీఆర్‌ఎస్ అని, రాబోయే రోజుల్లో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.డిప్యూటీ మేయర్‌గా చల్ల స్వరూప రాణి, చల్ల హరిశంకర్‌లు డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రజల ఇంటి బిడ్డలుగా సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొంటూ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడే అభివృద్ధి సాధించారని, మళ్లీ బీఆర్‌ఎస్ మేయర్ అయితే నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గంగుల సుధాకర్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.