epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి

కాక‌తీయ‌, కరీంనగర్ : జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్ ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీలపై వివక్ష, అణచివేతకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలని సూచించారు. ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగవంతమైన విచారణ చేపట్టి బాధితులకు తక్షణ సహాయం అందేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్య, ఉపాధి, గృహనిర్మాణం, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కాలర్‌షిప్‌ల పంపిణీ, హాస్టళ్ల వసతులు, స్వయం ఉపాధి యూనిట్లు, ఆర్థిక సహాయం, భూ సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ–ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అట్రాసిటీ కేసులపై తరచూ సమీక్షలు నిర్వహిస్తూ విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, ఆర్డీవో కె. మహేశ్వర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు నాగైలేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అనిల్ ప్రకాష్, ఏసీపీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.