epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజాస్వామ్య నిరసనకు అడ్డంకులు..

ప్రజాస్వామ్య నిరసనకు అడ్డంకులు..
‘మర్యాదగా చెప్పా.. ఇంకా రెండేళ్ల పాలన ఉంది’
పిన‌పాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాట్ కామెంట్స్‌

కాకతీయ, మణుగూరు : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణ పేరుతో వేధింపులు జరుగుతున్నాయని నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవాలని చూశారని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరులో ఆదివారం నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేగా కాంతారావు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీలు, కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అలాంటి నిరసనలను మణుగూరులో కాంగ్రెస్ నాయకులు కౌంటర్‌గా వచ్చి అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. “ఇప్పటిదాకా మంచిగా, మర్యాదగా చెప్పా. మీ పాలన ఇంకా రెండేళ్లు ఉంది—కౌంటర్ లెక్క పెట్టుకోండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్ద “66 వీడియోలు ఉన్నాయి” అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని పెంచాయి. “ఎవరినీ వదిలిపెట్టను… నేనేంటో కూడా రుచి చూపిస్తా” అంటూ రేగా చేసిన వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చాయి. కౌంటర్ ఇచ్చిన నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ, త్వరలోనే “వారి సంగతి తెలుస్తుంది” అని అన్నారు.

ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం

ఈ వ్యాఖ్యల అనంతరం ధర్నా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా, మణుగూరులో జరిగిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.