epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆపరేషన్ స్మైల్ విజయవంతం

ఆపరేషన్ స్మైల్ విజయవంతం
జిల్లాలో 52 మంది బాలలకు విముక్తి
బాల కార్మికులను ప‌నిలో పెట్టుకున్న‌వారిపై కేసులు
రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడి

కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం ఘన విజయాన్ని నమోదు చేసిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి 52 మంది బాలబాలికలను గుర్తించి, వారి భద్రతను నిర్ధారించినట్లు వెల్లడించారు. గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ముందు హాజరుపర్చి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వారి సంరక్షణకు అప్పగించినట్లు పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన బాలలను గుర్తించి కుటుంబాల వద్దకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘ఆపరేషన్ స్మైల్’, ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల అమలులో భాగంగా జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు.

ప్రత్యేక బృందాల తనిఖీలు

ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులు కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ వివరించారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో హోటళ్లు, దుకాణాలు, వర్క్‌షాపులు, బస్టాండ్‌లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుని బాలకార్మికులుగా వినియోగించిన వారిపై 4 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. బాలల హక్కులను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ పేర్కొన్నారు. వీధి బాలలు లేదా బాలకార్మికులను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ చర్యలతో బాలల భద్రతకు మరింత భరోసా కలుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.