epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వ‌హించితే చర్యలు తప్పవు!

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వ‌హించితే చర్యలు తప్పవు!
చెత్త వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్లు తప్పనిసరి
పన్ను ఎగవేతదారులపై ఆర్‌ఆర్ యాక్ట్ అమలు
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నెలలో పూర్తి చేయాలి
పారిశుద్ధ్య నిర్వహణపై క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి కఠిన ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరపాలక సంస్థ విధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కొంతమేర ఫలితాలు ఇచ్చిందని, మరోసారి సమగ్ర ప్రణాళికతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. చెత్త రవాణా వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్‌లు అమర్చాలని, వాటి కదలికలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరుకు ఎఫ్‌.ఆర్‌.ఎస్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నగరంలో కనీసం వెయ్యి ఖాళీ స్థలాలను గుర్తించి, అక్కడి పిచ్చి మొక్కలు తొలగించి చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మీడియన్లు, ప్రధాన రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దుమ్ము సమస్య లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేని హోర్డింగులు, పోస్టర్లు వెంటనే తొలగించాలని, మళ్లీ అతికిస్తే భారీ జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పనులు వంద శాతం పూర్తవ్వాలి

నగరంలో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వంద శాతం గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతతో పనులు వేగంగా పూర్తిచేయాలని, పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫుట్‌పాత్ పనులు మార్చి మొదటి వారంలోగా పూర్తిచేయాలని, అభివృద్ధి పనులపై ప్రతి వారం నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూలు కేవలం 32 శాతమే ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చినా పన్ను చెల్లించని భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. డిఫాల్టర్ల నీటి సరఫరా నిలిపివేయాలని, వాణిజ్య భవనాల పన్ను బకాయిలు వసూలు చేయకపోతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నగరంలోని పార్కులు, మీడియన్లలో పచ్చదనం పరిరక్షణకు వాటరింగ్ షెడ్యూల్ రూపొందించాలని, డ్రిప్ విధానంలో నీటి సరఫరా చేయాలని చెప్పారు. ఫుట్‌పాత్ ఆక్రమణలను అనుమతించవద్దని, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అమృత్ 2.0 పథకంలో చేపట్టిన తాగునీటి పనులు సకాలంలో పూర్తి చేయాలని, విద్యుత్ బిల్లులు తగ్గేలా మోటార్ల మరమ్మతులు మూడు వారాల్లో పూర్తిచేయాలని సూచించారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న 1.6 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను అదనపు సిబ్బందితో నాలుగు వారాల్లో ముగించాలని గడువు విధించారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, షెల్టర్ ఏర్పాటుచేసి నగరానికి దూరంగా తరలించాలని తెలిపారు. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా చీకటి ప్రాంతాలు ఉండకుండా పూర్తి స్థాయిలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, సహాయ కమిషనర్ అనిల్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.