epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామం కాదు..ప‌ట్ట‌ణం కాదు

గ్రామం కాదు..ప‌ట్ట‌ణం కాదు
మ‌ణుగూరు మునిసిపాలిటీలో విలీన‌మై అరిగోస‌
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు దూర‌మైన విలీన గ్రామాల ప్ర‌జ‌లు
విలీనానికి ముందు జీపీల్లో ఉపాధి హామీ కింద పనుల కేటాయింపు
ఉపాధి హామీ పనులు లేక 20 ఏళ్లుగా అవస్థలు
ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌

కాకతీయ, మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలోని పలు గ్రామాలను పట్టణ పరిపాలనలో విలీనం చేయడం అక్కడి ప్రజలకు వరంగా కాకుండా శాపంగా మారింది. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ విలీన నిర్ణయం వల్ల ఆయా గ్రామాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయిగూడెం, అన్నారం, కమలాపురం తదితర గ్రామాలు గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) ఈ గ్రామాలకు వర్తించకపోవడం పెద్ద సమస్యగా మారింది. గ్రామీణ హోదా కోల్పోవడం వల్ల ఉపాధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని, ఫలితంగా వందలాది కుటుంబాలు ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. విలీనానికి ముందు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద పనులు దొరికేవని, ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయిందని అంటున్నారు.

ఉపాధి లేక 20 ఏళ్లుగా నరకయాతన

విలీన గ్రామాల్లో నివసించే పేద, కూలీ కుటుంబాలు గత ఇరవై ఏళ్లుగా ఉపాధి హామీ పథకం కింద ఒక్క రోజు కూడా పని పొందలేదని ఆరోపిస్తున్నారు. గ్రామీణ పథకాలు వర్తించని స్థితి, మరోవైపు పట్టణ పథకాలు సక్రమంగా అందని పరిస్థితి ఏర్పడటంతో ప్రజలు రెండు వ్యవస్థల మధ్య నలిగిపోతున్నారు. “మేము గ్రామంలో ఉన్నామా, పట్టణంలో ఉన్నామా అనే స్పష్టతే లేదు. ఏ పథకం మాక్కు అందడం లేదు. ఉపాధి పనులు లేక కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి” అని అన్నారం గ్రామానికి చెందిన ఓ కూలీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి హామీనే ప్రధాన ఆధారమని, అది లేకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని పలువురు పేర్కొంటున్నారు.

వలస బాట పట్టిన కుటుంబాలు

పనులు లేకపోవడంతో అనేక కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువత ఇతర పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. విలీన నిర్ణయం వల్ల అభివృద్ధి జరుగుతుందని ఆశించినా, వాస్తవంలో జీవనం మరింత దుర్భరంగా మారిందని అంటున్నారు. పాలనా లోపాలే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాలను విలీనం చేసినప్పటికీ అక్కడ పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ సమస్యలు ఏర్పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వంపై ప్రజల డిమాండ్లు

విలీన గ్రామాల సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వర్తింపజేయాలని, లేకపోతే పట్టణ పరిధిలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే విలీన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని కూడా సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోకపోతే, రానున్న రోజుల్లో విలీన గ్రామాల ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.