epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ !

కౌశిక్‌రెడ్డికి భారీ షాక్ !

సొంత గడ్డపై ఎమ్మెల్యేకు గట్టి ఎదురుదెబ్బ
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ప‌రాభ‌వం
30 వార్డులున్న మున్సిపాలిటీలో 8 స్థానాల‌కే ప‌రిమితం
16 స్థానాల‌తో చైర్మ‌న్ పీఠం కాంగ్రెస్ వ‌శం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయంతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ 16 స్థానాల‌తో స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే అధికారాన్ని చేపట్ట‌నుంది. ఇప్పటి వరకు హుజూరాబాద్‌పై బలమైన పట్టు ఉందని భావించిన భారత రాష్ట్ర సమితి కేవలం 8 స్థానాలకు పరిమితం కావడం పరాభవంగా మారింది. గతంలో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ ఈసారి ఓటర్ల తీర్పుతో వెనుకడుగు వేసింది. ముఖ్యంగా ఈ ఫ‌లితాలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు గెలుచుకోగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

కౌశిక్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు

హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్‌గా నిలిచాయి. సొంత నియోజకవర్గ కేంద్రంలోనే పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోవడం ఆయన నాయకత్వానికి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు వ్యాఖ్యలు, ఘర్షణాత్మక వైఖరి, వివాదాస్పద రాజకీయాలతో వార్తల్లో నిలిచే ఆయ‌న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మాత్రం ఆస్థాయిలో ప్రభావం చూపలేకపోయార‌న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో మాత్రం ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై దృష్టి సారించకుండా రాజకీయ ఘర్షణలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈక్ర‌మంలోనే ఓటింగ్ రూపంలో అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశార‌ని భావిస్తున్నారు. సొంత గడ్డపై ఎదురైన ఈ ఫలితం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిణామంగా చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ హవా..

హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 30 వార్డుల్లో 16 స్థానాలు గెలుచుకుని స‌త్తాచాటింది. బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకు పరిమిత‌మైంది. బీజేపీ 5 వార్డుల్లో విజయం సాధించగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి రాజ్‌కుమార్ గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున మేకల స్వరూప, సునీత, గూడూరు అంజలి, ఇల్లందు సమ్మయ్య, జున్నోత్ భాస్కర్, పుణ్య, వెంకటేశ్వర్లు, బానోత్‌ వెంకట్, వెన్నెల, మహమ్మద్ ఖాలిద్, శ్రీలేఖ, రాంపల్లి శ్రీనివాస్, కోయాల్కర్ భారతీ, తాలపల్లి రమేష్, మొగిలి, సుహాసిని విజయం సాధించగా, బీఆర్ఎస్ నుంచి సమీరా గఫర్, నంది శ్రీనివాస్, ప్రతాప తార, సింధూజ, బండ నరేష్, రవీందర్ రావు, ప్రతాప మంజుల, కేసి రెడ్డి లావణ్య గెలిచారు. బీజేపీ తరఫున సుమలత, అనూష, మనోజ్, లక్ష్మీ దుర్గ, కొండా ప్రశాంతి విజయం సాధించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.