epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు

ఘనంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు…

పట్టు వస్త్రాలు సమర్పించిన

మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కాకతీయ, సిరిసిల్ల టౌన్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌,ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భీమేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… వేములవాడ ఆలయం రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయమని పేర్కొన్నారు.గతంలో ఆలయ అభివృద్ధి కోసం పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు, స్థానిక శాసన సభ్యుల చొరవతో ఆలయ అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు.వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల దేవుడిగా భావించే వేములవాడ రాజన్న ఆలయం, అలాగే సమ్మక్క సారలమ్మ ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

వేములవాడ రాజన్న ఆలయాన్ని సుమారు రూ.150 కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. రాజన్న ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పరమశివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పారదర్శక, ప్రజాకేంద్రీకృత పరిపాలన అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజా పాలన మరింత బలపడాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు.మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం, జిల్లా యంత్రాంగం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.